ఓ వివాహితకు సోషల్ మీడియాలో స్నేహం పేరుతో పరిచయం అయిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె నుంచి రూ. కోటి కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా.. అరెస్టయిన వారిలో నిజామాబాద్‌కు చెందిన మహేష్ (36), అనంతపురం జిల్లాకు చెందిన స్వామి (40) ఉన్నారు.