BHPL: జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పై బుధవారం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్.కే. జోషి దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిసి తీర్పు రిజర్వు చేస్తారని సమాచారం.