HYDలో ఎయిర్ క్వాలిటీలో ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్‌క్వాలిటీ మంగళవారం వట్టినగులపల్లిలో షాకింగ్‌గా 571గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.