Comedian Kevvu Karthik : జబర్దస్త్ టీవీషోలో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ చివరికి బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయమై కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. క్యాన్సరే భయపడే విధంగా తన తల్లి క్యాన్సర్‌తో పోరాటం చేసిందన్నారు.
ఐదు సంవత్సరాల రెండు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడి చివరికి తన తల్లి ప్రాణాల్ని విడిచిందని తెలిపారు. ఆవిడ జీవతమే ఒక పోరాటం అని గుర్తు చేసుకున్నారు. అలాంటి ఆమె ధైర్యం, ఆత్మ స్థైర్యం అమ్మ తనలోనూ నింపిందని అన్నారు. తనకు అన్నీ నేర్పించింది కాని అమ్మ లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించలేదంటూ రాశారు. అమ్మ కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసుపత్రిలో ఆమెకు వైద్యం అందించిన డాక్టర్లకు పాదాభివందనాలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ని చదివిని కార్తీక్ అభిమానులంతా ఆయనను ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ వారంతా ఆకాంక్షిస్తున్నారు.