»Former Mla And Jana Sena Leader Tv Rama Rao Who Hit The Shoe
AP Elections: చెప్పుతో కొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు
గత ఎన్నకల్లో వైసీపీకి ఓటు వేసినందుకు ఎస్సీల తరఫున టీవీ రామారావు చెప్పుతో కొట్టుకున్నాడు. వైసీపీ అధికారంలో ఎస్సీల హక్కుల, పథకాలు అన్ని నిర్లక్ష్యానికి గురయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే జైలు, హత్యలు అని వైసీపీపై ఆరోపణలు చేశారు.
Former MLA and Jana Sena leader TV Rama Rao who hit the shoe
AP Elections: వైసీపీ ఓటు వేయడం వలనే ఎస్సీలకు ఈరోజు ఈ పరిస్థితి అని, గత ఎన్నికల్లో ఎంత చెప్పినా మీరు వినలేదు వైసీపీ గెలిపించడానికి మీ ఓట్లు ఎంతగానే ఉపయోగపడ్డాయి అని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మీరు చేసిన పనికి చెప్పుతో కొట్టుకుంటున్న అని తన కాలి చెప్పుతో చెంపపై కొట్టుకున్నారు. ఇది ఎస్సీల తరఫున పశ్చాత్తాపం అని రామారావు ప్రకటించారు. గొడారిగుంటలోని తన కార్యాలయంలో కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు కూటమికి మద్దతు ప్రకటించారు.
గత ఐదేళ్లలో ఎస్సీలకు జరిగిన అన్యాయాలను మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు తన కారు డ్రైవర్‌ను హత్య చేయడం, ఇసుకదందాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించడం లాంటి ఘటనల గురించి మాట్లాడారు. వైసీపీ పార్టీకి జెండా, ఎజెండా ఏది లేదని వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష పడినా విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తికి మళ్లీ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఈ వైసీపీ పాలనలో 27 ఎస్సీ సంక్షేమ పథకాల రద్దు చేశారని వెల్లడించారు. ఇప్పటికైనా ఎస్సీలు కలసిరావాలని, కూటమికి మద్దతు పలకాలని కోరారు.