ASF: ‘పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా కెరమెరిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ నితికా పంత్ ప్రారంభించారు. మెడిలైఫ్, సన్ షైన్ ఆస్పత్రుల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో 900 మందికి ఉచిత పరీక్షలు, మందులు అందించారు. సుమారు 50 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ప్రజారోగ్యంపై పోలీసులు చూపుతున్న చొరవను పలువురు అభినందించారు.