AP: హర్షవీణపై దాడి చేసిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర విచారణ ముగిసింది. ఆయనను రైల్వేకోడూరు PSలో రేణిగుంట DSP శ్రీనివాసులు దాదాపు 5 గంటల పాటు విచారించారు. అనంతరం నాగేంద్ర మాట్లాడుతూ.. దాడి ఘటన గురించి అన్ని విషయాలను పోలీసులకు చెప్పానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కాగా జనసేన MLA అరవ శ్రీధర్‌పై హర్షవీణ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.