తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కేసు విషయంలో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద పరిగణించింది. ఈ మేరకు వారెంట్ జారీచేసింది. ఇటీవల ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జీఏడీలో రిపోర్ట్ చేశారు.
సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌గా కొనసాగారు. సీఎస్‌గా పనిచేశారు. క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ సవాల్ చేసింది. 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదోప వాదనలు జరగగా.. సీజే జస్టిస్ భూయాన్ బెంచ్ తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. టీఎస్ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. క్యాట్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి కొనసాగింపును రద్దు చేసింది.