సత్యసాయి: చిత్రావతి నదిలో గుర్రపుడెక్క, పిచ్చి మొక్కల వల్ల ఆక్సిజన్ అందక చేపలు మృతి చెందినట్లు పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. నదిలోకి చెడు వ్యర్థాలు వేయడం వల్ల జలచరాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నదిని కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.