KMM: కూసుమంచి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వీరవెల్లి నాగేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. శనివారం జరిగిన ఆయన దశదిన కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరై నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.