AP: పోలవరం జిల్లా నెలకోట కొండపై పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొన్ని వారాలుగా దేవీపట్నం మండలంలోని ప్రజల్లో భయం పుట్టిస్తోంది. పులి సంచారంతో కొండపై రామాలయానికి భక్తుల రాకను అధికారులు నిలిపివేశారు. అయితే, గతంలో పట్టుబడిన పులి కావడంతో ఇప్పటికే మెడలో ట్రాకర్ అమర్చారు. పులి కదలికల ఆధారంగా ఎప్పటికప్పుడు గ్రామాలను అలర్ట్ చేస్తున్నారు.