Elon Musk X users shock.. To open an account you have to pay money.
Elon Musk: ఉచితాలను ఎలా దుర్వినియోగం చేస్తారో అందరికీ తెలిసిందే. ఫ్రీగా ఏది ఇచ్చినా దాన్ని మంచి కన్న ఎక్కువగా చెడుకే వినియోగిస్తారు. అందుకే ఎలాన్ మస్క్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇకపై ఎక్స్ ఖాతా వాడాలంటే రుసుము చెల్లించాల్సిందే అని తేల్చేశాడు. ప్రపంచ అన్ని దేశాలకు ఇదే రూల్ తీసుకురానుకున్నాడు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ యాప్‌కు మంచి ఆదరణ నెలకొంది. అందుకే ఈ డబ్బుల వ్యవహారం అనుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే ఆయన చార్జ్ చేస్తున్నది అందిరికి కాదు. కొత్తగా అకౌంట్స్ తెరిచేవారికి ఈ కొత్త విధానం అమలు అవుతుంది. కొత్తగా వచ్చే వినియోగదారులు, పోస్ట్ చేయాలన్నా, ట్వీట్లకు లైక్ చేయాలన్నా, రీట్వీట్ చేయాలన్నా చివరికి బుక్ మార్క్ చేయడానికి కూడా చార్జ్ చెల్లించాల్సిందే అని వెల్లడించారు.
ఎక్స్ యాప్‌కు సంబంధించి వార్తను అందించే ఎక్స్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త ఖాతాలు తెరిచేవారు కచ్చితంగా నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ విధానం అమలు చేశారు. దీని ద్వారా స్పామ్‌ను తగ్గించవచ్చు, తద్వారా జన్యూన్ యూజర్లకు ఎదురయ్యే అవాంతరాలను అరికట్టవచ్చు అనేది ఎక్స్ ఉద్దేశం. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు.. దురదృష్టవశాత్తు కొత్త యూజర్లు రైటింగ్ యాక్సెస్ కోసం చిన్నమొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుందని, దీని ద్వారా బాట్ల దాడిని అరికట్టడం ఈజీ అవుతుందని తెలిపారు.