»Monkhood A Couple Who Donate Rs 200 Crores And Are Going To Be Accepted Into Monkhood
Monkhood: రూ.200 కోట్లు దానం చేసి సన్యాసం స్వీకరించబోతున్న దంపతులు
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల బాటలో నడుస్తారు. కానీ గుజరాత్‌కి చెందిన దంపతులు మాత్రం పిల్లల బాటలో నడవాలని కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Monkhood: సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల బాటలో నడుస్తారు. కానీ గుజరాత్‌కి చెందిన దంపతులు మాత్రం పిల్లల బాటలో నడవాలని కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌కి చెందిన భవేష్ బండారి నిర్మాణరంగంలో వ్యాపారం చేస్తున్నారు. అయితే అతనికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. 2022లో కుమారుడు విశ్వ, కూమార్తె భవ్య జైన సన్యాసులగా మారారు. వీరి ప్రేరణతో భవేష్ దంపతులు కూడా సన్యాసాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. భౌతిక సంబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 22న సన్యాసం స్వీకరించనున్నారు.
దేశమంతటా చెప్పులు లేకుండా యాత్ర చేస్తూ.. భిక్షతో మాత్రమే జీవించనున్నారు. కేవలం రెండు జతల తెల్లటి వస్త్రాలు, భిక్ష కోసం ఒక గిన్నెను తమవెంట తీసుకెళ్తారు. జైనమతంలో దీక్ష తీసుకోవడమనేది ముఖ్యమైన ఆచారం. ఇది వ్యక్తి భౌతిక సుఖాలను దూరం చేస్తుంది. అయితే గతేడాది ఓ వజ్రాల వ్యాపారి అతని భార్య, 12 ఏళ్ల కుమారుడు కూడా సన్యాసం స్వీకరించారు. అలాగే మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ ధనవంతుల కుటుంబం రూ.100 కోట్లను విరాళంగా ఇచ్చేసి తమ మూడేళ్ల కుమార్తెను వదిలి సన్యాసులుగా మారారు.