జగిత్యాల జిల్లా కేంద్రంలోని నియోనాటల్ 108 అంబులెన్స్‌ను శుక్రవారం 1962 స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ బాగిష్ మిశ్రా తనిఖీ చేశారు. నియోనాటల్ ఇంకుబేటర్, వెంటిలేటర్, సక్షన్ ఆపరేటర్, మల్టీ ఛానల్ మానిటర్, ఏఈడీతో పాటు ఇతర వైద్య పరికరాల పనితీరు, ఆక్సిజన్, మందులను, పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.