HYDలో మద్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 21 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అమ్మాల్సి ఉన్నా, కొంతమంది విక్రేతలు 15 ఏళ్ల పిల్లలకు కూడా మద్యం ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఉప్పల్, అత్తాపూర్, ఎల్బీనగర్ రామంతపూర్, నారాయణగూడ, కీసర వంటి ప్రాంతాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రతి చోట ఆధార్ చెక్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.