AP: మంత్రి లోకేష్ ఇవాళ కర్ణాటకలో పర్యటించనున్నారు. రాయచూర్ జిల్లా సింధనూరులోని ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం హోసల్లీ క్యాంప్‌లో శ్రీకృష్ణదేవరాయ సైనిక స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.