సప్తరుషి పేరుతో కేంద్ర బడ్జెట్ ఏడు ప్రాధామ్యాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘అమృత్ కాల్ బడ్జెట్’ అని పిలుస్తున్న ఈ బడ్జెట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఈ బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరచగా.. బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలు మాత్రం హర్షం వ్యక్తం చేశాయి. భారత్ కు దశదిశ ఇచ్చే అద్భుత బడ్జెట్ గా పేర్కొంటున్నాయి. రాజకీయ పార్టీల మాటలు ఎలా ఉన్నా కానీ ప్రజలు మాత్రం ఆశించేది మాత్రం ఒక్క విషయం. బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ప్రజలు ఏ ధరలు పెరుగుతున్నాయి? ఏ ధరలు తగ్గుతాయి అనే ఆలోచిస్తారు. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా.. మరికొన్ని వస్తు ఉత్పత్తుల ధరలు కొంత తగ్గుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.