NDL: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా పోలీస్ సంక్షేమ దివస్ నిర్వహిస్తున్నామని ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. శుక్రవారం నంద్యాల ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. విధుల్లో ఉన్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.