కర్నూలులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ సీఐ మన్సరుద్దీన్ మాట్లాడారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిసరాల్లో అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే వాహనాలపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించాలని సూచిస్తూ, ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.