ATP: జిల్లాకు ఈ నెల 6న వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటనలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం యాడికిలో జలధార కార్యక్రమంలో పాల్గొంటారని, గవర్నర్ అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరవుతారని తెలిపారు.