Atchannaidu : ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతి కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళావతి తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అచ్చెన్నాయుడు విషయం తెలుసుకున్న వెంటనే ఇంటికి వెళ్లారు. కాగా కళావతమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే ఫోన్ చేసి అచ్చెన్నతో మాట్లాడినట్లు సమాచారం. నారా లోకేష్ కూడా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.