VKB: ఉరుముల మెరుపులతో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం సాయంత్రం సా.4 గం. నుంచి వికారాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రజా జీవనం ఎక్కడిక్కడ స్తంభించింది. అకాల వర్షాల వల్ల మామిడి, ఉల్లి పంటలు నాశనం అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.