NLG: నల్గొండ నియోజకవర్గంలోని పలు రూట్లలో ఆటో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడుగురు పట్టే ఆటోలో ఏకంగా 30 మందిని ఎక్కించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఇటీవల వేంపాడు వద్ద ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.