CTR: సోమలలో తాజా మాజీ సర్పంచులకు శుక్రవారం సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు పాల్గొని వారి సేవలను ప్రశంసించారు. గ్రామాభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి వారికి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.