E.G: తాళ్లపూడి మండలంలోని వేగేశ్వరపురం, తిరుగుడు మెట్ట పంచాయతీలకు తహసీల్దార్ లక్ష్మీ లావణ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. బల్లిపాడు, గజ్జరం, తాడిపూడి గ్రామపంచాయతీలకు మండల వ్యవసాయ అధికారి రుషితను నియమించారు. ఇకపై ఈ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పరిపాలన కొనసాగనున్నదని అధికారులు తెలిపారు.