MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నివాసంలో శుక్రవారం కొత్తకోట కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటుపై చర్చించి, పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి కృష్ణ, మార్కెట్ ఛైర్మన్ ప్రశాంత్, శ్రీహరిరాజు, యుగంధర్ రెడ్డి, శ్రీనివాస్ సాగర్, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.