KDP: మైదుకూరు మున్సిపాలిటీ 10వ వార్డు సర్వాయిపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కౌన్సిలర్, టిడిపి నేత సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పండితుల ఆశీర్వచనాల మధ్య ఎమ్మెల్యే పునాదిరాయి వేసి పనులు ప్రారంభించారు.