MBNR: బాలానగర్ మండలం మోదంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బయోఫ్లోక్ ఫిష్ ట్యాంకులను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యమన్నారు.