ASR: డుంబ్రిగూడ మండలం మామిడి వలస గ్రామానికి చెందిన రీ సర్వే పాసు పుస్తకాలను ఈనెల 4న పంపిణీ చేయనున్నట్లు మండల తహసీల్దార్ త్రివేణి తెలిపారు. మొత్తం 30 పాసు పుస్తకాలకు గాను 26పాసు పుస్తకాలు పూర్తిగా సరిచూసి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొర్ర గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.