CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలోని గోశాలకు 200 బస్తాల పశువుల మేతను విరాళంగా అందజేశారు. విరాళం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పశువుల మేతను చెన్నైకు చెందిన శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున శ్రీనివాసులు నాయుడు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు ప్రత్యేక దర్శనం కల్పించారు.