TPT: ఎర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీలో యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజన పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్, ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ నిర్వహించారు. గిరిజన పిల్లలు చదువులో ముందుకు వస్తేనే కాలనీల అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. దాతలు మరింతగా సహకరించాలని కోరారు.