కోనసీమ: బీసీలకు తక్షణమే నేటి ప్రభుత్వం రక్షణ చట్టం అమలు చేయాలని బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్టా వీరబాబు గౌడ్ డిమాండ్ చేసారు. శుక్రవారం అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళమని తెలిపారు.