E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ‘ప్రజా గ్రీవెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై సుమారు 17 వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం పార్టీ కేడర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.