AP: రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా మన్యం జిల్లా భూమినిలో 41.8 డిగ్రీలు నమోదైంది. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4, అనకాపల్లి నాతవరంలో 40.9, శ్రీకాకుళం సిగడాంలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల, కడప, ఏలూరు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతున్నాయి.