NRML: కడెం మండలంలోని మాసాయిపేట గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.