కర్నూల్ నకిలీ పత్రాలతో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందిన 69 మందిపై చర్యలు చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రిషియన్) చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు తేలింది. వారిని తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు సీఎండీ శివశంకర్ లోతేటి నోటీసులు జారీచేశారు. వారిలో జిల్లాల వారీగా కడప-38, కర్నూలు-16, తిరుపతి-3, చిత్తూరు-4, నెల్లూరు-4 అనంతపురం-3 తొలగించారు.