SRPT: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, బీసీ సంక్షేమ అధికారి నరసింహులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.