నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల విన్నపాల మేరకు ఇప్పటికే రూ.27 కోట్లతో 240 అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.