W.G: కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కేశఖండనశాలకు శంకుస్థాపన జరిగింది. ఏలూరుపాడుకు చెందిన దాత దాట్ల శ్రీనివాసరాజు దంపతులు ఈ భవన నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ వసతి కల్పిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు