ATP: అనంతపురం పాతూరులో ఆధునిక వసతులతో నూతన మోడల్ పోస్టాఫీస్ భవనం నిర్మించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 1905లో నిర్మించిన ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిందని, దీనివల్ల బుక్కరాయసముద్రం మండల ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.