NLG: జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్నుల వసూళ్లలో 81 శాతం సాధించి చండూరు మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం రూ.1 కోటి లక్ష్యానికి గాను రూ.75 లక్షలు వసూలు చేసినట్లు కమిషనర్ మల్లేశం తెలిపారు. అధికారుల ప్రత్యేక కృషి, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని, ఈ నిధులతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.