కోనసీమ: రావులపాలెంలో 73 మంది లబ్ధిదారులకు రూ.45.39 లక్షల విలువైన CMRF చెక్కులను యువనేత బండారు సంజీవ్ అందజేశారు. ఆరోగ్య బీమా లేని పేదలకు చంద్రబాబు అందిస్తున్న ఈ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఆయన కొనియాడారు. కష్టకాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.