KMR: నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు కొప్పుల గంగారం మాట్లాడుతూ.. కొమురయ్య పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటికోల్ సాయిలు, ఉప సర్పంచ్ మహేశ్, కురుమ సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.