KMR: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన వీణ తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా సర్పంచ్ రవితేజ గౌడ్ ఆమెను అభినందించారు. గ్రామానికి పేరు తెచ్చిన వీణ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని గ్రామస్థులు ఆమెకు భరోసా ఇచ్చారు.