అనీల్ అంబానీ భార్య, ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా అంబానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి ‘జన్హా’ కన్నుమూశారు. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని టీనా అంబానీ గుర్తుచేసుకున్నారు. ‘నా పెద్దక్క జన్హా నాకు రెండో తల్లి లాంటిది. నా పెళ్లి సమయంలో ఆమె స్వయంగా కన్యాదానం చేసి, నన్ను మెట్టినింటికి సాగనంపింది. మా కుటుంబం మొత్తానికి ఆమె ముఖ్యమైన వ్యక్తి’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.