TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీపై సర్కారు నియంత్రణ చట్టం తీసుకురావాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒకేసారి 30-40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 8% మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు. అత్యవసరంగా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ కమిటీని వేయాలన్నారు.