VSP: విశాఖలోని వీఎంఆర్డీఏ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.900 కోట్ల బడ్జెట్ను సిద్ధం చేసింది. బోర్డు ఆమోదం అనంతరం అమలు చేస్తామని కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. అదనంగా రూ. 1000 కోట్ల ఆదాయం కోసం కొత్త లేఅవుట్లు అభివృద్ధి చేసి, ప్లాట్లు వేలం వేయనున్నారు. మాస్టర్ ప్లాన్-2041 అభ్యంతరాల నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపించనున్నారు.