MDK: ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 28 కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6309 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 6025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు.