KMM: భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడగట్టుకున్న సుమారు 45 లక్షల విలువ చేసే స్థిర చర ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే నిందితుల నుంచి 10 లక్షల 40 వేల విలువ చేసే ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.