AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పీఎస్లో కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని అధికారులు నిన్న కూల్చివేశారు. దీంతో అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న నాని అధికారులపై తీవ్ర బెదిరింపులకు దిగారు. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు నానిపై పోలీసులు కేసుూాియు నమోదు చేశారు.